: పాకిస్థాన్‌లో ఆయుధాలతో స్కూల్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు
పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లోకి సాయుధులైన ఇద్దరు దుండగులు ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఘటన అక్కడ కలకలం రేపుతోంది. స్కూల్ వద్ద కాల్పులు జరపడంతో సెక్యూరిటీ గార్డుకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్కూల్ వద్దకు చేరుకోవడంతో, దానిని గమనించిన సదరు దుండగులు పారిపోయారు. ఈ దుండగులను ఉగ్రవాదులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనలో విద్యార్థులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.