: 20 మంది బాయ్ ఫ్రెండ్స్ కి మైండ్ బ్లాంక్ చేసిన యువతి!


ఆమె పేరు గ్జియోలీ... చైనాలో ఉంటున్న 20 సంవత్సరాల యువతి. సొంత ఇల్లును కొనుక్కోవాలన్న ఆమె ప్రయత్నం 20 మంది యువకులకు దిమ్మ తిరిగేలా చేసింది. ఇంతకీ ఆమె ఏం చేసిందని అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సొంతింటి కలను నిజం చేయాలని గ్జియోలీ భావించింది. అందుకోసం యువకులను వల్లో వేసుకుంది. ఒకరూ ఇద్దరూ కాదు... ఏకంగా 20 మందిని. ఐఫోన్ అంటే తనకిష్టమని చెబుతూ, తన బాయ్ ఫ్రెండ్స్ జేబులు గుల్ల చేయిస్తూ, ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద నుంచి 20 ఐఫోన్లను బహుమతిగా తీసుకుంది. అంతేనా?... ఆపై ఆ స్మార్ట్ ఫోన్లను ఓ వెబ్ సైట్లో తక్కువ ధరకు విక్రయిస్తానని చెబుతూ రూ. 14 లక్షలు సంపాదించి, ఆ డబ్బుతో సొంతిల్లును కూడా కొనుగోలు చేసింది. ఆమె తన తెలివితేటలతో తన కోరికను తీర్చుకోగా, ఆమె బారిన పడి మోసపోయిన వారి అమాయకత్వానికి నెటిజన్ల నుంచి జాలితో కూడిన ట్వీట్లు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News