: కాల్ సెంటర్ స్కామ్ లో విరాట్ కోహ్లీ పేరు... షగ్గీకి ఆడీ కారును అమ్మాడని గుర్తించిన పోలీసులు!


అమెరికన్లను మోసం చేసి దాదాపు రూ. 500 కోట్లను నొక్కేసిన కాల్ సెంటర్ స్కామ్ కేసులో ఫేమస్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరు పోలీసుల రికార్డుల్లోకి ఎక్కింది. ఈ స్కామ్ సూత్రధారి సాగర్ థక్కర్ అలియాస్ షగ్గీకి ఖరీదైన ఆడీ కారును కోహ్లీ విక్రయించినట్టు గుర్తించిన ధానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆ కారును అహ్మదాబాద్ లో స్వాధీనం చేసుకున్నారు. ఈ లగ్జరీ కారును ముంబైకి తెచ్చేందుకు పోలీసులు రూ. 50 వేలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇక పోలీసు వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం, రూ. 3 కోట్ల విలువైన ఆడి ఆర్-8 కారును రూ. 60 లక్షలకు భారత టెస్టు కెప్టెన్ కోహ్లీ నుంచి రూ. 60 లక్షలకు కొనుగోలు చేసి, తన స్నేహితురాలికి బహుమతిగా ఇచ్చినట్టు తెలిపారు. "ఆడీ ఆర్8 వాహనాన్ని సీజ్ చేశాము. దీని విలువ రూ. 3 కోట్లు. విచారణలో ఇది విరాట్ కోహ్లీకి చెందినదని గుర్తించాము. అయితే, కోహ్లీకి థక్కర్ గురించి, ఆయన కార్యకలాపాల గురించి ఎంతమాత్రమూ తెలియదు. ఈ కేసుతో కోహ్లీకి సంబంధం లేదు" అని డీసీపీ పరాగ్ మనారే తెలిపారు. ఈ సంవత్సరం మే 7వ తారీకున కారును కోహ్లీ నుంచి షగ్గీ కొన్నాడని, వాహన యాజమాన్య బదిలీ ఇంకా జరగలేదని, ఇప్పటికీ కోహ్లీ పేరిటే కారుందని తెలుస్తోంది. దీంతో తదుపరి విచారణలో భాగంగా కోహ్లీని ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News