: ప్రీ రిలీజ్ బిజినెస్ లో 'గౌతమీపుత్ర' రికార్డ్... నైజాం రైట్స్ హీరో నితిన్ సొంతం
నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. బాలయ్య కెరీర్లోనే హై బడ్జెట్ మూవీగా వస్తున్న ఈ సినిమా... బిజినెస్ లో దుమ్మురేపుతోంది. 70 నుంచి 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి 'ఔరా' అనిపించాడు గౌతమీపుత్రుడు. ఈ సినిమా నైజాం రైట్స్ ను యంగ్ హీరో నితిన్ రూ. 11.25 కోట్లకు సొంతం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. రూ. 9 కోట్లకు సీడెడ్ హక్కులను సాయి కొర్రపాటి పొందినట్టు తెలుస్తోంది. ఆంధ్ర రైట్స్ రూ. 20 కోట్లకు వెళ్లాయట. అంతేకాదు, ఇప్పటికే రూ. 7 కోట్లకు పైగా ఓవర్సీస్ బిజినెస్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది. వరుస హిట్లతో బాలయ్య దూసుకుపోతుండటం, ఇది ఆయన 100వ సినిమా కావడం, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం, చారిత్రక నేపథ్యం కలిగిన సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.