: దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్


పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్థాన్ తో పాటు ప్రపంచ దేశాల్లో దీపావళి వేడుకులు జరుపుకుంటున్న హిందువులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ఒక రేడియో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తమ దేశాభివృద్ధి కోసం ఇక్కడి ముస్లింలతో కలిసి హిందువులు, మైనార్టీ ప్రజలు పనిచేసే తీరు తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందంటూ సంతోషం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజల మనోభావాల్ని గౌరవిస్తూ, వారికి సమాన హక్కులు కల్పించడం తమ ధ్యేయమన్నారు. జాతి, మతంతో సంబంధం లేకుండా వారికి స్వేచ్ఛ, భద్రత కల్పించే విషయమై పాకిస్థాన్ జాతిపిత జిన్నా ఎంతో కృషి చేశారని నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News