: యూకే ట్రేడ్ యూనియన్ల అభ్యంతరాలతో రతన్ టాటాకు కొత్త చిక్కులు!


టాటా గ్రూప్ సంస్థల తాత్కాలిక చైర్మన్ రతన్ టాటాకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. టాటా స్టీల్ యూకే యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలపై అక్కడి కార్మిక సంఘాలు అభ్యతరం వ్యక్తం చేస్తున్నాయి. సంస్థ నిర్ణయాలపై తన వైఖరిని వెల్లడించాలని నేషనల్ ట్రేడ్ యూనియన్ స్టీల్ కో-ఆర్డినేటింగ్ కమిటీ ఆదేశించింది. కార్మికుల పెన్షన్ స్కీముల్లో మార్పులు చేయడంపైనా, మూలధన పెట్టుబడుల విషయంలోనూ టాటా స్టీల్ యూకే యూనిట్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటుండగా, ఈ నిర్ణయాలను ట్రేడ్ యూనియన్లు ఆమోదించే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇక్కడి పరిశ్రమలో పనిచేస్తున్న వారందరికీ మెరుగైన పెన్షన్లు ఇవ్వాలన్న డిమాండ్ సంస్థ లాభాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద కంపెనీలో ఏళ్ల తరబడి పనిచేసి కూడా పదవీ విరమణ తరువాత మంచి జీవనాన్ని గడపలేకపోతున్నామన్నది యూకే కార్మికుల వాదన. నష్టాల్లో ఉన్న యూకే బిజినెస్ ను అమ్మేస్తున్నట్టు, ఈ సంవత్సరం మార్చిలో విక్రయిస్తున్నట్టు టాటా స్టీల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ డీల్ తాజాగా తొలగించబడ్డ చైర్మన్ సైరస్ మిస్త్రీ నేతృత్వంలో జరిగింది. మిస్త్రీని తొలగించడంతో తమ భద్రతపై రతన్ టాటా హామీ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News