: ఓటమి ఘోరమే... క్షమాపణ చెప్పేదేమీ లేదు: విలియమ్సన్
విశాఖపట్నంలో జరిగిన ఆఖరి వన్డేలో తమ జట్టు ఘోరంగా వైఫల్యం చెందిందని, టర్న్ తిరుగుతున్న బంతులను ఎదుర్కొనడంలో అందరమూ విఫలమయ్యామని, ఈ విషయంలో క్షమాపణ చెప్పే అవసరం ఏమీ లేదని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వ్యాఖ్యానించాడు. 16 పరుగుల వ్యవధిలో 8 మంది పెవీలియన్ దారి పట్టడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన, ఈ ఓటమి తమకు ఎన్నో గుణపాఠాలు నేర్పిందని అన్నాడు. దారుణంగా ఓడిపోవడం బాధాకరమే అయినా, జట్టును చక్కదిద్దుకోవడానికి తమకు మంచి అవకాశం లభించిందని అన్నాడు. ఇండియా జట్టు చక్కటి ప్రతిభను సిరీస్ ఆసాంతం కనబరిచిందని, వారి నిలకడైన ప్రదర్శనే సిరీస్ ను అందించిందని కితాబిచ్చాడు.