: ఎన్టీపీసీలో కూలిన కోల్ బంకర్.. విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
రామగుండంలోని ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) కర్మాగారంలో కోల్ బంకర్ కుప్పకూలింది. ఈ ఘటనతో నాలుగో యూనిట్ లో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోగా, సమీప గ్రామాల్లో కరెంటు సరఫరా నిలిచినట్టు తెలుస్తోంది. కాగా, కూలిన బంకర్ కింద ఎవరైనా ఉన్నారా? అన్న సంగతి తెలియరాలేదు. సహాయక చర్యలు ప్రారంభించామని, బంకర్ నుంచి బొగ్గును బయటకు తెచ్చే ఏర్పాట్లు మొదలయ్యాయని ఎన్టీపీసీ అధికారి ఒకరు వెల్లడించారు. మరిన్ని విషయాలు తెలియాల్సివుంది.