: అతని అండతో నేనేంటో నిరూపించుకున్నా: అమిత్ మిశ్రా
రవిచంద్రన్ అశ్విన్ విశ్రాంతి తీసుకోవడంతో జట్టులో స్థానం సంపాదించి తన అద్భుత ప్రతిభతో న్యూజిలాండ్ లో జరిగిన ఐదు వన్డేల సిరీస్ లో 15 వికెట్లు సాధించి, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికైన స్పిన్నర్ అమిత్ మిశ్రా వైజాగ్ వన్డేలో ఘన విజయం తరువాత స్పందించాడు. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే తనకెంతో అండగా నిలిచాడని, ఆయన ప్రోత్సాహంతోనే తానేంటో నిరూపించుకున్నానని చెప్పుకొచ్చాడు. తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం వెనుక కుంబ్లే సహకారం ఎంతో ఉందని, అంచనాలకు అనుగుణంగా రాణించడంపై తనకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. గతంలో సాధించిన రికార్డులను పట్టించుకోకుండా భవిష్యత్ మ్యాచ్ లపై దృష్టిని సారించి ముందడుగు వేయాలన్నది తన లక్ష్యమని పేర్కొన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేశానని, దాంతోనే తనకు ఐదు వికెట్లు దక్కాయని తెలిపాడు.