: గుర్గావ్‌లో దారుణ ఘటన.. అందరూ చూస్తుండగా 30 సార్లు పొడిచి యువతిని చంపిన యువకుడు


పింకి అనే యువ‌తిని ఇటీవ‌ల గుర్గావ్‌లోని ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ వద్ద 25 ఏళ్ల‌ జితేంద్ర అనే యువకుడు దారుణంగా హ‌త్య చేశాడు. ఈ ఘటన జ‌రుగుతుండ‌గా కెమెరాకు చిక్కిన దృశ్యాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి. ఆ యువ‌తికి 22 ఏళ్ల వయసని తెలుస్తోంది. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో మెట్రో స్టేషన్‌లో న‌డుచుకుంటూ వెళుతోన్న ఆమెను జితేంద్ర అడ్డుకొని ఒక్క‌సారిగా కత్తితో దాడిచేశాడు. విచ‌క్ష‌ణార‌హితంగా ఆమె పొట్టలో 30 సార్లు పొడిచాడు. అయినా క‌సితీర‌ని ఆ యువ‌కుడు రాక్ష‌సుడిలా ప్ర‌వ‌ర్తించి ఆ యువ‌తి గొంతుకోశాడు. ఈ దాడికి దిగిన‌ జితేంద్రను అడ్డుకోవడానికి అక్క‌డి నుంచి వెళుతున్న ఒక వ్య‌క్తి ప్ర‌య‌త్నించాడు. త‌న వ‌ద్ద ఉన్న‌ బ్యాగు సాయంతో అడ్డుకోవాల‌నుకున్నాడు. అయినా యువ‌కుడు త‌న దాడిని ఆప‌లేదు. చివరికి అక్కడున్న వారు అంతా ఈ ఘ‌ట‌న‌పై వేగంగా స్పందించి, అంద‌రూ క‌లిసి నిందితుడిపై తిర‌గ‌బ‌డి దాడి చేశారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా, ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.

  • Loading...

More Telugu News