: విశాఖ వన్డే అప్డేట్స్: నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. అర్ధసెంచరీతో క్రీజులో విరాట్ కోహ్లీ
విశాఖ వన్డేలో టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 59 బంతుల్లో 41 పరుగులు చేసి సాంట్నర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్యూగా వెనుదిరిగాడు. మరోవైపు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 62 బంతుల్లో 50 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ధోనీ అవుటయి వెనుదిరగగానే క్రీజులోకి వచ్చిన ఎంకే పాండే మైదానంలో కాసేపు కూడా నిలవకుండా వెంటనే డకౌట్‌గా వెనుదిగాడు. సోధీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 40 ఓవర్లలో 199గా ఉంది.