: యడ్యూరప్పపై అప్పీల్ కు వెళ్లే యోచనలో కర్ణాటక


మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పకు కష్టాలు ఇప్పట్లో తీరేటట్టు లేవు. అవినీతి ఆరోపణల కేసులో యడ్డీకి సీబీఐ కోర్టు ఇటీవలే క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే, సీబీఐ కోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని... కేబినెట్ భేటీలో చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. యడ్డీ కేసులో సీబీఐ కావాలనే నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News