: 'మీరుంటేనే మేమున్నా'మంటూ వీర జవాన్లకు గ్రీటింగ్స్ చెబుతున్న క్రికెటర్లు


'ఈ దీపావళికి వీర జవాన్లకు శుభాకాంక్షలు చెప్పండి' అంటూ ప్రదాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకి విశేష స్పందన వస్తోంది. ఈ నేపధ్యంలో, 'వీర జవాన్ల కుటుంబాలకు శుభాకాంక్షలు. మీ త్యాగాలు మేము మరువలేము, మీకు దీపావళి శుభాకాంక్షలు' అని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తెలుపగా; 'మీరుంటేనే మేమున్నాము. మీరు లేని మేము ఊహించలేము. కొంత మందికి ఇది అర్థం కావచ్చు, మరి కొందరికి ఇది అర్ధం కాకపోనూ వచ్చు. అయితే మీ వెంట 125 కోట్ల భారతావని ఉంది. మీ క్షేమం కోరుకుంటోంది. మీకు మా శుభాకాంక్షలు' అని సెహ్వాగ్ తెలిపాడు. ప్రతి ఒక్కరూ సైనికులకు శుభాకాంక్షలు చెప్పాలని కోరాడు. ఇక టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సైనికులంతా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించాడు. సినీ నటుడు అక్షయ్ కుమార్ సైనికుల సేవలు కొనియాడాడు. తామిలా ఉండడానికి కారణం సైనికులేనని చెప్పాడు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తదితర బాలీవుడ్ తారలు కూడా సైనికులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.

  • Loading...

More Telugu News