: హయత్ నగర్ లోని హైవే బావర్చి హోటల్ సీజ్


కొంత కాలంగా పేకాట నిర్వహిస్తున్న హైదరాబాదు శివారు హయత్ నగర్ లోని హైవే బావర్చి హోటల్ ను సీజ్ చేశారు. రెవెన్యూ, పోలీసు అధికారులు ఈరోజు అక్కడికి వెళ్లి ఆ హోటల్ ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, హైవే బావర్చి హోటల్ నిర్వాహకులు కొంత కాలంగా పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఈ నెల 5న దాడి చేసి, జూదరులను అదుపులోకి తీసుకున్నామన్నారు. హోటల్ పై తదుపరి చర్యల్లో భాగంగా ఆర్డీఓకు తాము లేఖ రాశామని చెప్పారు. దీనిపై విచారించిన ఇబ్రహీంపట్నం ఆర్డీఓ గేమింగ్ యాక్ట్ ప్రకారం హోటల్ ను సీజ్ చేయాలని రెండు రోజుల క్రితం ఆదేశించారన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ హోటల్ ను సీజ్ చేశామని చెప్పారు.

  • Loading...

More Telugu News