: నెల్లూరులో కాజల్ ను చూసేందుకు ఎగబడ్డ అభిమానులు
నెల్లూరులో ప్రముఖ సినీనటి కాజల్ సందడి చేసింది. ఒక వస్త్ర దుకాణాన్ని ప్రారంభించేందుకు వెళ్లిన కాజల్ ను చూసేందుకు నెల్లూరు వాసులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో, షాపింగ్ మాల్ పరిసర ప్రాంతాలు కాజల్ అభిమానులతో నిండిపోయాయి. అభిమానులను అదుపు చేయడం పోలీసులకు కష్టసాధ్యమైంది. స్థానిక జీఎస్ టీ రహదారిపై అభిమానులు సందడి చేయడంతో ట్రాఫిక్ ను దారి మళ్లించాల్సి వచ్చింది.