: మొన్న డెన్మార్క్... నేడు ఫ్రాన్స్... మరోసారి నిరాశ పరిచిన పీవీ సింధు
రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకున్న తెలుగమ్మాయి, షట్లర్ పీవీ సింధుకు ప్రస్తుతం ఏమీ కలిసి రావట్లేదు. తన కెరీర్ లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ ను సాధించాలన్న ఆమె కోరిక మొన్న డెన్మార్క్ లో నేడు ఫ్రాన్స్ లో విఫలమైంది. ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రౌండ్ లోనే వరుస సెట్లలో ఘోర పరాజయం పాలైంది. చైనా అమ్మాయి హీ బింగ్ జియోతో రెండు రౌండ్ లు ఆడిన సింధు 22-20, 21-17 తేడాతో ఓటమి పాలైంది. కాగా, మరోవైపు పురుషుల సింగిల్స్ లో తైపీ ఆటగాడు చో టీన్ చెన్ తో తలపడిన హెచ్ఎస్ ప్రణయ్ 21-19, 21-16 తేడాతో ఓడిపోయాడు.