: అలహాబాద్ హైకోర్టులో బాంబులు పెట్టి వెళ్లిన దుండగులు!


అలహాబాద్ హైకోర్టులో పెను ప్రమాదం తృటిలో తప్పింది. కోర్టు ప్రాంగణంలోని 55వ గదిలో నాటు బాంబులు, టపాసులు ఉన్న సంచీని గుర్తించిన కొందరు, వెంటనే బాంబు నిర్వీర్య బృందానికి సమాచారం పంపగా, వారు వచ్చి వాటిని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఆపై జిల్లా మెజిస్ట్రేట్ సంజయ్ కుమార్, ఎస్పీ శలభ్ మాథుర్ లు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దాదాపు 150 మంది సెక్యూరిటీ సిబ్బంది 210 సీసీటీవీ కెమెరాలు ఉన్న హైకోర్టులో ఈ సంచీని తెచ్చింది ఎవరన్నది తెలియకపోవడం పనితీరు లోపమేనన్న విమర్శలు వస్తున్నాయి. కాగా, ప్రస్తుతం దీపావళి సెలవులు ఉండటంతో ఎవరో కావాలని బ్యాగును అక్కడ పెట్టి ఉంటారని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News