: జపాన్లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చేనెల 11, 12వ తేదీల్లో జపాన్లో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా మోదీ జపాన్ ప్రధానమంత్రి షింజో అబేతో సమావేశమవుతారు. భారత్-జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సత్సంబంధాలపై ఇరువురు ప్రధానులు చర్చిస్తారు. ఆ దేశ అధికారులతో నరేంద్ర మోదీ ప్రధానంగా ఆర్థిక, రక్షణ సహకారంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.