: ఓటును కొంటే అవినీతి ఎలా అవుతుంది?: హైకోర్టులో చంద్రబాబు లాయర్ ఆసక్తికర వాదన
ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడు పేరును చేర్చాలా? వద్దా? అన్న విషయమై హైకోర్టులో విచారణ సాగుతున్న వేళ ఆయన తరఫు వాదనలు వినిపించిన సిద్ధార్థ లూద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటును కొనుగోలు చేస్తే, అది అవినీతి చట్టం కిందకు రాదని, ఈ కేసులో పీడీ యాక్టును ఎలా నమోదు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి తాను చేయాల్సిన పనికి లంచం తీసుకుంటే అవినీతి చట్టం కింద కేసు పెట్టొచ్చుగానీ, అదే ఉద్యోగి ఎన్నికల్లో ఓటేసేందుకు డబ్బు తీసుకుంటే ఇదే చట్టం ఎలా వర్తిస్తుందని, ఉద్యోగి హోదాలో అతను ఓటు వేయడం లేదు కదా? అని గుర్తు చేస్తూ, ఓటు హక్కు ప్రజా విధుల్లో భాగం కాదని వాదన వినిపించారు. ప్రజా విధుల్లో భాగం కాని నేరానికి పీడీ చట్టం ఎలా వర్తిస్తుందని అడిగారు. కాగా, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ మేరకు ఈ కేసు విచారణ తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే.