: ‘అమ్మ’ కోసం పూజలు చేస్తుంటే.. 'అమ్మో' అనిపించిన తేనెటీగలు!


తమిళనాడు సీఎం ‘అమ్మ’ జయలలిత ఆరోగ్యం కోసం యజ్ఞం చేస్తున్న అన్నా డీఎంకే నేతలను తేనెటీగలు కుట్టిన సంఘటన తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో జరిగింది. వడచేరి శక్తి మరియమ్మన్ కోయిల్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ యజ్ఞంలో అంబూరు ఎమ్మెల్యే ఆర్.బాలసుబ్రమణి, గుడయతం ఎమ్మెల్యే జయంతి సహా 8 మంది అన్నాడీఎంకే నేతలు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలోని ఒక రావిచెట్టు కింద ఈ యజ్ఞం నిర్వహిస్తున్నారు. అయితే, పొగ కారణంగా ఆ చెట్టు కొమ్మల్లో ఉన్న పెద్ద తేనెతుట్టెలోని తేనెటీగలు బయటకు రావడం, కుట్టడం క్షణాల్లో జరిగిపోయింది. అయితే వాటి బారి నుంచి తప్పించుకోవడానికి నానా పాట్లు పడిన ఫలితం లేకుండా పోయింది. ఎమ్మెల్యే జయంతి మాత్రం ఒక కారులోకి ఎక్కి కూర్చుని డోర్ వేసుకున్నారు. అయితే, ఆమె భర్త పద్మనాభన్, ఎమ్మెల్యే బాలసుబ్రమణి, మిగిలినవారు మాత్రం తేనెటీగల దాడికి గురయ్యారు. వీరిని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు.

  • Loading...

More Telugu News