: హైదరాబాదులోని సచివాలయం వద్ద హోంగార్డుల ఆందోళన, ఉద్రిక్తత
హైదరాబాదులోని తెలంగాణ సచివాలయం వద్ద హోంగార్డులు ఆందోళన చేపట్టారు. ఇందిరా పార్కు నుంచి సచివాలయం ముట్టడికి తరలివచ్చిన హోంగార్డులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హోంగార్డులు, అక్కడే బైఠాయించి, ఆందోళన చేపట్టారు. గత మూడు గంటలుగా వారు నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్నారు. వారితో పోలీసు ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఉద్యోగభద్రత కల్పించాలని, జీతాలు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. స్పష్టమైన హామీ వచ్చేవరకు ఆందోళన జరుగుతుందని వారు స్పష్టం చేశారు.