: ‘విత్ మై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్’ అంటూ ట్వీట్ చేసిన షారూక్ ఖాన్


‘విత్ మై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ రేష్మ, మమత, స్వప్న, బాసంతి’ అంటూ బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ఒక ట్వీట్ చేశాడు. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఒక బ్యూటీ కాంటెస్ట్ కు షారూక్ హాజరయ్యాడు. యాసిడ్ దాడుల నుంచి బతికి బయటపడి ధైర్యంగా తమ జీవితాలను కొనసాగిస్తున్న కొంత మంది మహిళలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారితో ఫొటోలు కూడా దిగారు. ఈ నేపథ్యంలో వారితో దిగిన ఒక పోస్ట్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షారూక్ పోస్ట్ చేశాడు. వాళ్లని మళ్లీ కలుస్తానని, ముఖ్యంగా మమత ‘రొమాంటిక్ షాయరీ’ కోసం మరింత సమయం వెచ్చిస్తానని ఈ సందర్భంగా షారూక్ హామీ ఇచ్చాడు.

  • Loading...

More Telugu News