: ఒడిశాలో మానవత్వం మరోసారి మంటగలసింది!


ఒడిశాలో రెండు నెలల క్రిందట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతిచెందగా, అంత్యక్రియల నిమిత్తం ఆమె భర్త ధనమాంజీ ఆమె మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ స్వగ్రామానికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అదే రాష్ట్రంలో మానవత్వం మరోసారి మంటగలసింది. తాజాగా ఒడిశాలోని అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతమైన కలహందీ లోని కోక్సారా బ్లాక్ లోని మహిమా పంచాయత్ లో సావిత్రి జువాయిడ్ అనే మహిళ మృతిచెందింది. సవర కులానికి చెందిన సావిత్రి, గౌడ కులానికి చెందిన వ్యక్తిని కులాంతర ప్రేమ వివాహం చేసుకుంది. వారిద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. కొన్ని నెలల క్రితం ఆమె భర్త మృతి చెందాడు. ఆ తర్వాత అనారోగ్యం బారినపడ్డ సావిత్రి కూడా నిన్న మృతి చెందింది. తమకెవరూ లేకపోవడంతో ఆమె అంత్యక్రియలకు సహాయం చేయాలని గ్రామస్థులను ఆమె కుటుంబ సభ్యులు కోరారు. అయితే, ఎవరూ ముందుకు రాకపోవడంతో, మంచానికి రెండు పొడవాటి వెదురు బొంగులు కట్టి ఆ మంచంపై ఆమె మృతదేహాన్ని పెట్టి, ఈడ్చుకుంటూ వెళ్లి ఖననం చేశారు. దీనిని చూసిన కొంత మంది జిల్లా కలెక్టర్ కు తెలియజేయడంతో ఇతర కార్యక్రమాలు పూర్తిచేయాలని ఆదేశిస్తూ, కొంత మంది వ్యక్తులకు 2000 రూపాయలు ఇచ్చి పంపించారు.

  • Loading...

More Telugu News