: తన ఉద్యోగులకు 400 ఫ్లాట్లు, 1260 కార్లు బోనస్ గా ఇచ్చిన వ్యాపార 'వజ్రం'!


సావ్ జీ ఢోలాకియా... మన దేశంలో పేరుమోసిన వజ్రాల వ్యాపారి. సూరత్ కు చెందిన ఈ బిలియనీర్ ప్రతి యేడాది వందల కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తారు. అయితే, వచ్చిన లాభాలన్నీ తానే అనుభవించకుండా, వాటి ఫలాలను తన ఉద్యోగులకు కూడా పంచుతారు. తాజాగా, దీపావళి పండుగ సందర్భంగా తన ఉద్యోగులకు 400 ఫ్లాట్లు, 1260 కార్లను గిఫ్ట్ గా ఇచ్చారు. దీనికోసం ఏకంగా రూ. 51 కోట్లు ఖర్చు చేశారు. గత ఏడాది కూడా తన ఉద్యోగులకు 491 కార్లు, 200 ఫ్లాట్లు బోనస్ గా ఇచ్చారు ఢోలాకియా. 2011 నుంచి ప్రతి ఏడాది ఈ రకంగా బోనస్ లు ఇవ్వడం ప్రారంభించింది ఆయన సంస్థ హరే కృష్ణ ఎక్స్ పోర్ట్స్. తన అంకుల్ చేసిన చిన్న సాయంతో డైమండ్స్ వ్యాపారం మొదలు పెట్టిన ఢోలాకియా... బిలియనీర్ గా ఎదిగారు. ఎన్నో కష్టనష్టాలను కోర్చి ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. అందుకే, డబ్బు విలువ ఏంటో తన కుమారుడికి తెలియడానికి అతడిని కోచికి పంపించారు. కేవలం రూ. 7 వేలు మాత్రమే ఇచ్చి, తన పేరు ఎక్కడా వాడుకోకుండా నెల రోజుల పాటు ఏదైనా ఉద్యోగం చేసి, డబ్బు సంపాదించాలని షరతు విధించారు.

  • Loading...

More Telugu News