: ఇంద్రకీలాద్రిపై రిసెప్షన్ వింగ్ ను ఏర్పాటు చేస్తున్నాం: ఈవో సూర్యకుమారి


విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ప్రొటోకాల్ సమస్యకు తెరపడనుంది. దుర్గ గుడి ఈవో సూర్యకుమారి తమను లెక్కచేయడం లేదంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఇటీవల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను వివరణ కోరడమే కాకుండా, సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించడం విదితమే. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై రిసెప్షన్ వింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో సూర్యకుమారి పేర్కొన్నారు. సిబ్బంది కొరత వల్లే ప్రొటోకాల్ వివాదం చోటుచేసుకుందని అన్నారు. సిబ్బంది నుంచి కూడా వ్యతిరేకత వస్తోందని, ఇకపై ప్రజాప్రతినిధులు, ప్రజల సూచనలు తీసుకునే తాను ముందుకు వెళ్తానని సూర్యకుమారి చెప్పారు. కాగా, ఎమ్మెల్యే బాలకృష్ణను కూడా దుర్గ గర్భగుడిలోకి వెళ్లనీయలేదని, సిఫారసులను పక్కన పడేస్తున్నారని, ఎమ్మెల్యేలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదంటూ దుర్గగుడి ఈవోపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేయడం విదితమే.

  • Loading...

More Telugu News