: బుర్రిపాలెం రోడ్లపై ఫేస్‌బుక్ లో స్పందించిన సినీ హీరో మహేశ్‌బాబు


శ్రీ‌మంతుడు సినిమాలో న‌టించిన త‌రువాత సీనీ హీరో మహేశ్‌బాబు గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని తమ స్వగ్రామం బుర్రిపాలెంను దత్తత తీసుకుని ఆ ప్రాంతంలో అభివృద్ధి ప‌నులు చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. కేవ‌లం ద‌త్త‌త తీసుకొని పై పై ప‌నులు చేసి వ‌దిలేయ‌కుండా మ‌హేశ్ ఆ గ్రామాభివృద్ధిపై ఎంతో శ్ర‌ద్ధ‌పెడుతున్నారు. ఆయ‌న దృష్టి ప‌డిన త‌రువాత బుర్రిపాలెం అభివృద్ధిని సాధిస్తోంది. అక్కడ అనేక ప‌నులు కొన‌సాగుతున్నాయి. ఆ గ్రామంలో డ్రెయిన్లు, రోడ్లు బాగుప‌డ్డాయి. మ‌హేశ్‌బాబు తాజాగా ఆ గ్రామంలో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌పై త‌న‌ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా స్పందించారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో అక్క‌డ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. గ్రామంలో జ‌రిగిన స‌ద‌రు ప‌నుల‌ ఫొటోలను ఆయ‌న‌ పోస్ట్‌ చేశారు. గల్లా జయదేవ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News