: పరువు తీసే పనులు చేయకండంటూ పాక్ క్రికెటర్లపై ఆ దేశ పార్లమెంట్ సీరియస్!


విదేశాల్లో క్రికెట్ ఆడేందుకు వెళ్లినప్పుడు హుందాగా ప్రవర్తించాలని, దేశం పరువు తీసే పనులు చేయవద్దంటూ పాక్ క్రికెటర్లపై ఆ దేశ పార్లమెంట్ సీరియస్ అయింది. ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఈ ఏడాది జులై 14 నుంచి 18 వ తేదీ వరకు జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో పాకిస్థాన్ 75 పరుగులు తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన సంతోషంలో పాక్ ఆటగాళ్లు బస్కీలు తీసి, సెల్యూట్ చేశారు. దీనిపై, ఇంగ్లాండ్ కెప్టెన్ కుక్ తో పాటు పలువురు క్రికెటర్లు విమర్శల వర్షం కురిపించారు. దీంతో, పాక్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ స్పందిస్తూ.. తమ ఫిట్ నెస్ కు సహకరించిన పాకిస్థాన్ ఆర్మీకి ధన్యవాదాలు చెబుతూ ఆ విధంగా చేశామని చెప్పుకొచ్చాడు. తాజాగా, ఇదే అంశంపై పాక్ పార్లమెంట్ కూడా స్పందించింది. విదేశాలకు వెళ్లినప్పుడు హుందాగా ప్రవర్తించాలి కానీ, ఇవేమి పనులంటూ మండిపడింది. పాక్ కెప్టెన్ మళ్లీ స్పందిస్తూ పాత వివరణే మళ్లీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News