: కళలకు హద్దులు లేకపోవచ్చు కానీ, దేశానికి ఉన్నాయిగా!: వెంకయ్యనాయుడు
‘కళలకు హద్దులు లేకపోవచ్చు కానీ, దేశానికి ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రం విడుదల విషయమై మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్)కు, చిత్ర నిర్మాతకు మధ్యవర్తిత్వాన్ని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ నెరపడంలో ఎటువంటి తప్పులేదన్నారు. పాకిస్థానీ నటీనటులు మనదేశంలో పనిచేయకూడదని ప్రభుత్వం ఎటువంటి నిషేధం విధించలేదన్నారు. అయితే, రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజల సెంటిమెంట్ ను దర్శకనిర్మాతలు గౌరవించాల్సిన అవసరముందని సూచించారు. అదేవిధంగా, ప్రజల సెంటిమెంట్లను దెబ్బతీయకుండా ఉండాల్సిన బాధ్యత నటీనటులపై కూడా ఉంటుందని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు అన్నారు.