: మృత్యువుతో పోరాడి, గెలిచి ఆసుపత్రి నుంచి డిశ్చార్జయిన ‘చిన్నారి సంజన’


ఇటీవ‌లే హైదరాబాద్‌లోని పెద్ద అంబ‌ర్‌పేట వ‌ద్ద తాగుబోతుల ర్యాష్ డ్రైవింగ్ కు రోడ్డుప్రమాదానికి గురైన చిన్నారి సంజ‌న కోలుకోవ‌డంతో ఈ రోజు ఆసుప‌త్రి నుంచి ఆమెను డిశ్చార్జి చేశారు. ప్ర‌మాదంలో త‌ల‌కి తీవ్రంగా గాయం కావ‌డంతో సంజ‌న కొన్ని రోజుల పాటు మృత్యువుతో పోరాడింది. 24 రోజుల పాటు ఆ చిన్నారికి ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందించారు. సంజ‌న కోలుకోవ‌డంతో ఆమె కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం పెద్ద అంబర్‌పేట వద్ద సంజ‌న త‌న త‌ల్లితో క‌లిసి రోడ్డు దాటుతుండ‌గా డ్రంకెన్ డ్రైవ్ చేస్తోన్న ఓ యువకుడు కారుతో వారిరువురినీ ఢీకొట్టాడు. పంజాగుట్ట‌లో ర‌మ్య అనే చిన్నారికి ప్ర‌మాదం జ‌రిగి ఆమె ప్రాణాలు కోల్పోయిన కొన్ని రోజుల‌కే ఇటువంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో స‌ర్వ‌త్ర ఆందోళ‌న వ్య‌క్తమైంది.

  • Loading...

More Telugu News