: ఆ వార్త నిజం కాదంటూ ట్వీట్ చేసిన సమంత


'అత్తారింటికి దారేది' సినిమాకు సీక్వెల్ వస్తోందని, ఆ సినిమాలో తాను నటిస్తున్నానంటూ వచ్చిన వార్తలను హీరోయిన్ సమంత కొట్టిపారేసింది. ఆ వార్తలు నిజం కాదని ఆమె ట్వీట్ చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై 'అత్తారింటికి దారేది' సినిమాకు సీక్వెల్ వస్తోందని... ఆ సినిమాకు 'దేవుడే దిగివచ్చినా' అనే టైటిల్ ఖరారు చేశారని... డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలవుతుందని... హీరోగా పవన్ కల్యాణ్, హీరోయిన్ గా సమంత నటిస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే, ఆ వార్తలు నిజం కాదంటూ సమంత ట్వీట్ చేసింది. అయితే, సీక్వెల్ రావడం నిజం కాదా? లేక సీక్వెల్ లో హీరోయిన్ గా తాను నటించడం నిజం కాదా? అనే విషయాన్ని సమంత క్లియర్ గా చెప్పలేదు.

  • Loading...

More Telugu News