: దీపావళి వేడుకలో పాల్గొన్న ట్రంప్ కోడలు లారా... పనిలో పనిగా ఓటు వేయాలంటూ అభ్యర్థన


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం సొంత పార్టీ నేతలు కూడా ముందుకు రావడం లేదు. కానీ, గెలుపు కోసం ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఎవరికీ వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ భార్య మెలానియ, కుమార్తె ఇవాంకాలు ట్రంప్ కు ఓటు వేయాలని అమెరికన్లను అభ్యర్థించారు. తాజాగా ఆయన కోడలు (రెండో కుమారుడు ఎరిక్ భార్య) లారా తెరపైకి వచ్చింది. వర్జీనియాలోని లాడన్ కౌంటీలోని హిందూ దేవాలయంలో నిర్వహించిన దీపావళి వేడుకలకు ఆమె హాజరైంది. పనిలో పనిగా తన మామగారికి ఓటు వేయాలంటూ ఇండియన్-అమెరికన్ ప్రజలను కోరింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికా, భారత్ ల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఈ సందర్భంగా ఆమె తెలిపింది. భారతదేశమన్నా, భారతీయులన్నా తన మామకు ఎంతో ఇష్టమని చెప్పింది. భారతీయ సంస్కృతిని ఎంతో గౌరవిస్తానని చెప్పిన లారా... తన చెప్పులను బయటే వదిలిపెట్టి దేవాలయంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా, లారాకు ఎన్నారై సంఘం నేత రాజేశ్ గూటి స్వాగతం పలికారు. వాస్తవానికి ట్రంప్ కుమార్తె ఇవాంకా ఇక్కడకు రావాల్సి ఉంది. కానీ, ఆమె వేరే చోటికి వెళ్లాల్సి రావడంతో లారా హాజరైంది.

  • Loading...

More Telugu News