: ఏఓబీ భారీ ఎన్‌కౌంటర్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరా
ఆంధ్రా, ఒడిశా సరిహద్దు(ఏఓబీ)లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పందించారు. ఈ కాల్పుల్లో పోలీసుల చేతితో మావోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బహ్రెయిన్‌లో ఉన్న రాజ్ నాథ్ అక్కడి నుంచే ఎన్‌కౌంటర్‌పై ఆరా తీశారు. ఎన్‌కౌంటర్‌పై ఎప్పటికప్పుడు అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో రాజ్‌నాథ్‌సింగ్ ఫోన్‌లో మాట్లాడారు. ఆ రాష్ట్రంలో మావోయిస్టుల అణిచివేతకు తాము సాయం అందిస్తామని పేర్కొన్నారు. కాగా, నక్సల్స్ ఏరివేతలో పాల్గొన్న పోలీసులను నవీన్ పట్నాయక్ అభినందించారు.