: బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఈ రోజు ఉదయం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. స్కాలర్ షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో సర్కారు ఆడుకుంటోందంటూ ఏఐఎస్ఎఫ్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేశారు. మినిస్టర్ క్వార్టర్స్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు. వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసులకి, ఆందోళనకారులకి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.