: జయలలిత డిశ్చార్జికి ఏర్పాట్లు.. స్వయంగా ఆహారం తీసుకుంటున్న ‘అమ్మ’
అనారోగ్యానికి గురై గత నెల 22న చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం దాదాపు కుదుట పడింది. ఆమె స్వయంగా ఆహారం తీసుకుంటున్న నేపథ్యంలో డిశ్చార్జి కోసం వైద్యులు సన్నాహాలు చేస్తున్నారు. దేశ, విదేశీ వైద్యుల చికిత్సతో కోలుకున్న సీఎం వైద్యులతో మాట్లాడుతున్నారు. ఆహారాన్ని కూడా స్వయంగా తీసుకుంటున్నట్టు సమాచారం. ఆమెకు చికిత్స అందిస్తున్న లండన్ వైద్యుడు మంగళవారం ఆస్పత్రిలో ఆమెకు జరుగుతున్న చికిత్సను పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీపావళికి ముందే అంటే ఈ నెల 27నే జయను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై అదే రోజు ఆస్పత్రి వర్గాలు ప్రకటన విడుదల చేయనున్నట్టు సమాచారం.