: ఫేస్ బుక్ మాయలో'పడి' ప్రాణాలు పోగొట్టుకున్న విద్యార్థిని!


‘ఫేస్ బుక్’ మాయలో పడి తాను కూర్చున్న పిట్టగోడపై నుంచి కింద పడి ఒక విద్యార్థిని మృతి చెందిన సంఘటన కోల్ కతాలో ఈ రోజు జరిగింది. కోల్ కతాలోని ఒక ప్రముఖ పాఠశాలలో XI తరగతి విద్యార్థి అయిన అనుష్క మోండల్ తన నివాసంలోని పిట్టగోడపై కూర్చుని సెల్ ఫోన్ ద్వారా తన ఫేస్ బుక్ ఖాతాను చెక్ చేసుకుంటోంది. అకస్మాత్తుగా, అక్కడి నుంచి కిందపడటంతో ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహం పక్కన సెల్ ఫోన్ కూడా పడిఉందని తెలిపారు. ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగిందా? లేక ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అనుష్క తరచుగా సామాజిక మాధ్యమాలకు అనుసంధానం కావడంపై ఆమె తల్లిదండ్రులు మందలిస్తుండేవారు.

  • Loading...

More Telugu News