: తుపానుగా మారిన వాయుగుండం...పేరు కయాంత్


తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా మారిందని విశాఖపట్టణంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీనికి 'కయాంత్'గా నామకరణం చేసినట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. తుపాను ప్రస్తుతం పశ్చిమ నైరుతి దిశగా కదులుతోందని, ఈ రాత్రికి పోర్టుబ్లెయిర్‌ తీరానికి ఉత్తర వాయవ్యంగా 610 కిలోమీటర్ల దూరంలో, విశాఖ తీరానికి తూర్పు దిశలో 780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంటుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో అంటే 27 లేదా 28 నుంచి తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వారు తెలిపారు. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వారు సూచించారు.

  • Loading...

More Telugu News