: షారూక్, గౌరీల వివాహ బంధానికి పాతికేళ్లు!
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్, గౌరీ ల వివాహమై నేటికి 25 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు వారిని అభినందిస్తూ సామాజిక మాధ్యమాల్లో పలు పోస్ట్ లు చేశారు. కాగా, 1984 నుంచే షారూక్ ఖాన్, గౌరీలు ఒకరికొకరు తెలుసు. 1991లో వారి వివాహమైంది. అయితే, షారూక్ ఖాన్ అప్పటికి ఇంకా బాలీవుడ్ యాక్టర్ కాలేదు. టీవీ నటుడిగా ఉన్న షారూక్ బాలీవుడ్ స్టార్ కావాలనే కలలు కంటూ ఉండేవాడు. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందన్నట్లు .. బాలీవుడ్ బాద్ షా గా షారూక్ సక్సెస్ వెనుక గౌరీ పాత్ర కూడా ఎంతో ఉంది. 25 ఏళ్ల వైవాహిక జీవితంలో వారికి ముగ్గురు సంతానం. కొడుకు ఆర్యన్, కూతురు సుహాన్. సరోగసీ ద్వారా పుట్టిన మరో కొడుకు అబ్ రామ్.