: కేజ్రీవాల్ సూపర్ స్టుపిడ్...4వ తరం అబద్ధాలకోరు: పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్


ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ సేథ్‌ సత్‌ పాల్‌ శిరోమణి అకాలీ దళ్‌ లో చేరిన సందర్భంగా జలంధర్ లో ఆయన మాట్లాడుతూ, ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్ లో 7 నుంచి 8 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. 2012లో పీపీకి పట్టిన గతే వచ్చే ఎన్నికల్లో ఆప్ కి పడుతుందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ బిల్లు అమలులోకి వస్తుండగా, పంజాబ్ లో వ్యాట్ తగ్గిస్తామని చెబుతూ ప్రజలను కేజ్రీవాల్ మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్ సూపర్ స్టుపిడ్ అని, 4వ తరం అబద్ధాలకోరని ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్న ఢిల్లీలో విద్యుత్ ఛార్జీలను తగ్గించలేని కేజ్రీవాల్ పంజాబ్ లో ఎలా తగ్గిస్తారని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రిని జైలుకు పంపుతామని పేర్కొన్న కేజ్రీవాల్, ఇంకా ఆ పని చేయలేదని గుర్తుచేశారు. దీనిని బట్టి చూస్తే కేజ్రీవాల్ హామీలు మాత్రమే ఇస్తారని, వాటిని అమలు చేయరని అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News