: జగన్ ప్రసంగిస్తున్న వేళ.. కబడ్డీ ఆడుకున్న విద్యార్థులు!
కర్నూల్ లోని ఫంక్షన్ హాలులో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రసంగిస్తుంటే.. బయట ఉన్న విద్యార్థులు సరదాగా కబడ్డీ ఆడుకున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా లభిస్తే ఒనగూరే ప్రయోజనాల గురించి జగన్ సీరియస్ గా మాట్లాడుతుంటే, బయట ఉన్న విద్యార్థులు మాత్రం కబడ్డీ ఆడుకోవడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియోను ఒక న్యూస్ ఛానెల్ ప్రసారం చేసింది.