: అమెరికా అధ్యక్షుడు కావాలన్న ఆశ ఉన్నా... కాలేకపోతున్న అర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్


అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడానికి ఇదే సరైన సమయమని 'టెర్మినేటర్' అర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ అన్నారు. తాను ఒకవేళ అమెరికాలో పుట్టి ఉంటే... ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేవాడినని చెప్పారు. ఓ ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన తాను... ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు మాత్రం ఓటు వేయనని చెప్పారు. మీ పార్టీ కంటే మీ దేశమే ముఖ్యమని తోటి రిపబ్లికన్లకు సలహా ఇస్తున్నానని ఆయన అన్నారు. ఆస్ట్రియాలో జన్మించిన అర్నాల్డ్ కు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అర్హత లేదు. అధ్యక్ష పదవికి పోటీ పడాలంటే జన్మత: అమెరికన్ అయ్యుండాలి.

  • Loading...

More Telugu News