: చంద్రబాబుకి అసలు ఇంగ్లీషు వ‌స్తుందా?: వైఎస్‌ జ‌గ‌న్‌ ఆగ్రహం


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదాపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన స్టేట్ మెంట్ చూస్తే ఇంగ్లీష్ వ‌చ్చిన ఏ ముఖ్య‌మంత్రి అయినా దానికి అనుకూలంగా స్పందించ‌బోర‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అన్నారు. కానీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాత్రం సానుకూలంగా స్పందించార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. క‌ర్నూలు జిల్లా గుత్తి రోడ్డులోని వీజేఆర్ ఫంక్షన్ హాల్లో ఈ రోజు ఆయ‌న ప్ర‌త్యేక హోదా వ‌ల్ల వ‌చ్చే ప్రయోజనాల గురించి యువ‌త‌ను తెలియ‌జెప్ప‌డానికి యువభేరి నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... జైట్లీ ఇచ్చిన‌ స్టేట్ మెంట్‌పై చంద్ర‌బాబు నాయుడు స్పందించిన తీరు చూస్తూ ఆయ‌న‌కు అస‌లు ఇంగ్లీషు వ‌స్తుందా? అని అనుమానం వ‌చ్చింద‌ని అన్నారు. అరుణ్‌జైట్లీ ప్ర‌త్యేక‌హోదా కాదు, దానికి త‌గ్గ ప్యాకేజీ ఇస్తున్నాం అంటూ చేసిన ప్ర‌క‌ట‌న‌పై ఎన్డీఏ గ‌వ‌ర్న‌మెంట్లో త‌న పార్టీ మంత్రుల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్నాన‌ని చెప్పాల్సిందిపోయి, ఆ ప్రకటన పట్ల సానుకూలంగా ఉన్నానంటూ చంద్ర‌బాబు నాయుడు అన్నార‌ని జ‌గ‌న్ అన్నారు. ఆ ప్రకటనను స్వాగ‌తిస్తున్నాన‌ని, ప్యాకేజీ బాగుంద‌ని చంద్ర‌బాబు చేసిన‌ అటువంటి ప్ర‌క‌ట‌నతో రాష్ట్రం న‌ష్ట‌పోతుంద‌ని చెప్పారు. ప్యాకేజీ బ్రహ్మాండ‌మైంద‌ని చంద్ర‌బాబు పొగిడారని ఆయ‌న అన్నారు. అస‌లు ప్యాకేజీ అంటే ఏమిటో చంద్ర‌బాబుకి తెలుసా? అని ప్ర‌శ్నించారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌స్తే ప్ర‌యోజ‌నాలు చాలా ఉంటాయని జగన్ చెప్పారు. ప్యాకేజీ ఇచ్చినందుకు మోదీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపి, వెంక‌య్య‌ను స‌న్మానిస్తున్నారని ఆయ‌న అన్నారు. విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న‌వి మాత్ర‌మే జైట్లీ చెప్పారు.. కానీ, కేంద్రం ప్ర‌త్యేక ప్యాకేజీ ఇవ్వ‌లేదని ఆయ‌న అన్నారు. హోదా ఉన్న రాష్ట్రాల‌కే పారిశ్రామిక రాయితీలు ఇస్తారని చెప్పారు. బ్యాంకుల్లో ఉన్న బంగారం మ‌ళ్లీ రావాలంటే బాబు రావాల‌న్నారని, ఉద్యోగాలు రావాలంటే బాబు రావాలి అన్నారని జ‌గ‌న్ అన్నారు. అవి వ‌చ్చాయా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.

  • Loading...

More Telugu News