: యుద్ధం నుంచి పారిపోతున్న వారిని పట్టుకొని మరణదండన విధించిన ఐఎస్ఐఎస్


ఐఎస్ఐఎస్ అధీనంలో ఉన్న మోసుల్ న‌గ‌రాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఇరాకీ ద‌ళాలు పెద్దఎత్తున ఆ ప్రాంతంలోకి ప్ర‌వేశించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆ ద‌ళాల‌ను ఎదిరించేందుకు ఉగ్ర‌వాదులు కూడా పోరాడుతున్నారు. నగరాన్ని తిరిగి హస్తగతం చేసుకునేందుకు భద్రతా దళాలు ఒక్కో గ్రామంలోకి ప్ర‌వేశిస్తూ ఉండ‌డంతో ప‌లువురు ఉగ్ర‌వాదులు మోసుల్ ప్రాంతం నుంచి పారిపోయారు. అయితే, యుద్ధంలో పోరాడ‌కుండా పారిపోతున్న వారిని ఐఎస్ఐఎస్ వ‌దిలిపెట్ట‌డం లేదు. పిరికిపందల్లా పారిపోయేందుకు ప్రయత్నించారంటూ తాజాగా ఏడుగురికి మ‌ర‌ణశిక్ష‌కు అమ‌లుచేసింది. మోసూల్‌ నగరం నుంచి వారు అనుమ‌తి లేకుండా వెళ్లిపోతున్నందుకు ఈ శిక్ష‌ విధించిన‌ట్లు పేర్కొంది. ఈ ఏడుగురు సిరియా సరిహద్దులో పట్టుబడిన‌ట్లు చెప్పింది. వీరు జాతిద్రోహానికి పాల్పడిన వారుగా అభివ‌ర్ణించింది.

  • Loading...

More Telugu News