: చైనాలో బాంబు పేలుడు... 10 మంది మృతి... 147 మందికి తీవ్ర గాయాలు
నిన్న రాత్రి చైనాలో సంభవించిన బాంబు పేలుడులో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 147 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చైనాలోని ఫుగూ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఫుగూలోని జిన్ మిన్ ప్రాంతంలోని ఓ నివాస గృహంలో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఈ ఇంటి సమీపంలోని ఇతర గృహాలు, ఓ ఆసుపత్రి ధ్వంసమయ్యాయి. వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. పేలుడు ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. పేలుడుకు గల కారణాలు ఇంతవరకు తెలియరాలేదు.