: షిర్డీసాయి కాదు కావాల్సింది.. సుదర్శన చక్రాలు: ద్వారాకా పీఠాధిపతి స్వరూపానంద


షిర్డీసాయిపై ద్వారకా శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి తీవ్ర వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లా హన్మకొండలోని వేయి స్తంభాల గుడి ప్రాంగణంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి వేద విద్వన్మహాసభల ముగింపు కార్యక్రమంలో ఈరోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సంబంధిత పత్రాలను అందజేశారు. అనంతరం వారికి దివ్యాశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా స్వరూపానంద మాట్లాడుతూ, ‘దేశాన్ని కాపాడేది షిర్డీ సాయిబాబా కాదు.. సుదర్శన చక్రాలు. అందుకే దేశమంతటా సుదర్శన చక్రాల స్థాపన జరగాలి. లోకాన్ని జాగృత పరిచే శక్తి ఒక్క సుదర్శన చక్రానికే ఉంది’ అని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News