: ఉత్తమ్ కుమార్ ఇక తన గడ్డంతో జడలు కట్టాల్సిందే!: కవిత ఎద్దేవా
తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ గడ్డంపై నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ లోని ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామంలో పర్యటించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే వరకు గడ్డం గీసుకోనని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతినబూనారని, అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి తన గడ్డంతో జడలు కట్టేసినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని ఆమె స్పష్టం చేశారు. నిజాం షుగర్స్ ను తామే తెరిపిస్తామని ఆమె చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆమె అన్నారు.