: క్రీడా ప్రేమికుల ప్రశంసల్లో తడిసి ముద్దవుతున్న జో రూట్!


ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఏ ఆటల పోటీల్లో అయినా ప్రత్యర్థిపై విజయం సాధించగానే విజేతలు సంబరాలు చేసుకోవడం అలవాటు. అయితే, ఇందుకు భిన్నంగా ఓటమి పాలైన ఆటగాడిని విజేత ఓదార్చిన క్రీడాస్పూర్తి తాజాగా ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి టెస్టు సందర్భంగా చోటుచేసుకుంది. తొలి టెస్టులో విజయానికి ఇక 32 పరుగులు చేయాల్సిన దశలో రెండు వికెట్లు చేతిలో ఉండడంతో విజయం బంగ్లాదేశ్ దేనని అంతా భావించారు. ఈ దశలో ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ బంగ్లాదేశ్ కు షాకిస్తూ వరుసగా రెండు వికెట్లు తీసి తమ జట్టుకు 22 పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు. దీంతో బంగ్లా ఆటగాడు షబ్బీర్ రెహ్మాన్ (64 నాటౌట్) క్రీజులో కూలబడిపోయాడు. దీంతో సంబరాలు చేసుకోవాల్సిన జో రూట్ సంబరాలు చేసుకోకుండా... నేరుగా షబ్బీర్ వద్దకు వెళ్లి ఓదార్చాడు. ఆటలో గెలుపోటములు సహజమని, అవకాశాలు మళ్లీ మళ్లీ వస్తుంటాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపాడు. ఇది క్రీడా ప్రేమికులందర్నీ ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News