: తిరుమలలో ప్రసాదం తయారీ ప్రాంతంలో అగ్నిప్రమాదం
తిరుమలలో అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీవేంకటేశ్వరస్వామివారి ప్రసాదాలు తయారు చేసే ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. మితిమీరిన వేడి వల్ల వ్యర్థాలు అంటుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. మరోవైపు, మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో, సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు.