: సురేష్ రైనా కొంప ముంచిన వైరల్ ఫీవర్


వైరల్ ఫీవర్ సురేష్ రైనా కొంప ముంచింది. న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ కు ఎంపికైన రైనా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అయితే అనూహ్యంగా వైరల్ ఫీవర్ బారినపడ్డ రైనా తొలి మూడు వన్డేలకు దూరమయ్యాడు. రెండు వన్డేల్లో భారత జట్టు విజయం సాధించడంతో జట్టులో మార్పులు చేసి, కూర్పును చెడగొట్టకూడదని బీసీసీఐ భావిస్తోంది. దీంతో మిగిలిన రెండు వన్డేలకు టీమిండియాలో ఎలాంటి మార్పులు చోటుచేసుకునే అవకాశం లేదు. దీంతో రైనా జ్వరం నుంచి కోలుకున్నా ఎలాంటి ఉపయోగం ఉండే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే జట్టు కూర్పుపై సంతోషంగా ఉన్నట్టు ధోనీ పేర్కొన్నాడు. తరువాతి వన్డే ధోనీకి ఎంతో అచ్చొచ్చిన వైజాగ్ లో జరుగనుండడంతో ఆ వన్డే విజయంపై అంతా ధీమాగా ఉన్నారు.

  • Loading...

More Telugu News