: కిర్కుక్ నగరంలో ఉగ్రవాదులపై ముగిసిన యుద్ధం.. 74 మంది జిహాదీలు హతం
ఇరాక్‌లో పలు నగరాలను స్వాధీనం చేసుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు ఇరాక్ దళాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇరాకీ దళాలతో కూడిన సంకీర్ణసేనలు ఉగ్రవాదులపై తుదిపోరుకి సిద్ధమై ఆయా నగరాలను స్వాధీనం చేసుకోవడానికి కదిలిన విషయం తెలిసిందే. కిర్కుక్ నగరంలో ఇరాక్ దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకరమైన పోరు ఈ రోజుతో ముగిసింది. ఈ దాడిలో 74 మంది జిహాదీలు హతమైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. అక్కడి జనజీవనం తిరిగి సాధారణ స్థితికి చేరుకుందని ప్రకటించారు. అక్కడి ఐసిస్ చీఫ్‌ను కూడా తాము అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. దళాలు జరుపుతున్న పోరులో భయపడిపోయిన కొందరు ఉగ్రవాదులు పారిపోగా మరికొందరు ఆర్మీకి ఎదురుగా నిలబడి పోరాడి మృతి చెందారు. కాగా, కొందరు ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకున్నారు.