: సొంతవారి మధ్యే అఖిలేశ్ సంక్షోభం ఎదుర్కొంటున్నారు: శత్రుఘ్న సిన్హా
గత ఉత్తరప్రదేశ్ ఎన్నికల అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అఖిలేశ్ యాదవ్‌ను ‘అనుభవజ్ఞుడైన తండ్రి ఉన్న డైనమిక్ యువకుడు’ అంటూ కొనియాడిన బాలీవుడ్ నటుడు, భాజపా ఎంపీ శత్రుఘ్న సిన్హా మరోసారి అఖిలేశ్‌ను ఉద్దేశిస్తూ తాజాగా ట్వీట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో అధికార పార్టీ సమాజ్‌వాదీ పార్టీలో విభేదాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శత్రుఘ్న సిన్హా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. అఖిలేశ్ యాదవ్‌ను చూస్తుంటే తన గుండె తరుక్కుపోతోందని పేర్కొన్నారు. సొంతవారి మధ్యే ఆయన సంక్షోభం ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎంతో నలిగి పోతోన్న అఖిలేష్ తన రాజకీయ సమస్యల నుంచి బయటపడాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.